సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులో ఓ ప్రేమోన్మాది ఘాతుకం నేడు, శుక్రవారం 6-1-2023 న వెలుగులోకి వచ్చింది. వివరాలలో వెళ్ళితే .. కొండ్రుప్రోలు గ్రామంలో పొలం పనులు చేసుకొనే గాజులపాటి కల్యాణ్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రుల కు చెప్పడంతో వారు కల్యాణ్ ను పలుమార్లు మందలించారు. అయితే మరింత ఆగ్రహంతో కల్యాణ్.. గత గురువారం అర్ధరాత్రి ఉన్మాదిగా మారి ఆమెతో పాటు కుటుంబ సభ్యు లపై విచక్షణా రహితం గా దాడి చేశాడు. యువతి నోటివద్ద , మెడ, వెన్నె ముక, ఛాతీ భాగాల్లో కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయం లో అడ్డుకోవడానికి వచ్చిన యువతి తల్లి, చెల్లిపైనా దాడి చేసాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితులను స్థానికులు వైద్యం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటం తో ఏలూరు ప్రభుత్వా సుపత్రికి తరలించారు. తాడేపల్లి గూడెం రురల్ ఎస్సై ఎం .శ్రీనివాసరావు దాడికి పాల్ప డిన యువకుడు కళ్యాణ్ ను నేడు, శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *