సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నా యువతులపై దాడుల కేసులలో నిందితులను వదిలేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని .. కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరమని హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరమని అన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు. వారికీ చట్టప్రకారం వెంటనే కఠిన శిక్షపడేలా చేస్తామని, బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *