సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే యువతతోనే సాధ్యమని, యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పిలుపునిచ్చారు. భీమవరం మన్నా చర్చ్ ఆవరణలో మన్నా చర్చ్ యూత్ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. భారతీయ అధికార చిహ్నం లో మనకు మూడు సింహాలు కనిపిస్తాయని, కనపడని నాలుగో సింహమే యువత అని, ఉన్నత చదువులను అభ్యసించే రాష్ట్రానికి వెన్నుముకలా యువత ఉండాలని, యువత లేనిది ఏమి జరగదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యువత ద్వారానే కూటమి విజయం సాధించిందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు యువత ముందుకు వచ్చారని, యువతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, నిరుద్యోగులకు నెలకు రూ 3 వేలు నిరుద్యోగ భృతి కూడా అందిస్తామని అన్నారు. నిరాశతో యువత ఉండకూడదని, డైర్యంతో ఉండాలని, యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చనని అన్నారు. నేటి యువత ప్రతి ఒక్కరిని గౌరవించాలని, అదరణతో చూడాలని, మంచి సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో దేవదాసు సంఘ కాపరి, మన్నా చర్చ్ నిర్వాహకులు జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
