సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపూర్‌లో నేడు, బుధవారం మద్యాహ్నం నిర్వహిస్తున్న భారీ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్m బీజేపీ రాష్ట్ర అడ్జక్షుడు మాధవ్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చుతున్నామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నమన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామన్నారు.యువత, మహిళలు, రైతులు భవిష్యత్‌ కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పవన్‌ అన్నారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించామని గుర్తు చేశారు.ఇంత దిగ్విజయంగా ఈ సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువచ్చామ. పర్యటక రంగానికి సంబంధించి కూడా 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్శిస్తున్నాము. పంచాయితీ రాజ్‌ శాఖలో 13.300 గ్రామ పంచాయతీలలో గ్రామస భలు నిర్వహించి రికార్డు క్రియెట్‌ చేశామన్నారు. 2007 కిలో మీటర్ల బీటీ రోడ్లను, 4000 సీసీ రోడ్లను నిర్మించాం. లక్షా50వేల నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ ని నిల్వచేయగలిగా మన్నారు. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు 1500 పైగా నీటి తొట్లు నిర్మించామన్నారు. 22518 మినీ గోకులాలు ఏర్పాటు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *