సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “యోగా ఆంధ్ర 2025” లో భాగంగా నేటి సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో రాష్ట్రా ఎమ్మెల్యే లతో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి తో కలిసి ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు యోగ ఆసనాలు వేశారు. పెద్దలు పిన్నలు అందరు తప్పనిసరిగా యోగ శిక్షణ అమలు చెయ్యాలని ,యోగ మానసిక ఒత్తిడులను తగ్గిస్తుందని దేహానికి, మనస్సుకు ఆరోగ్యం మించిన ఆనందం మారేది ఇవ్వలేదని ఎంతో సునాయాసంగా అనారోగ్యాలనుండి కాపాడే శక్తి యోగాకు మాత్రమే ఉందని, భారత్ లో పుట్టిన యోగ పక్రియ ఈ రోజు ప్రపంచానికి ఆదర్శమైందని రఘురామా కృష్ణంరాజు అన్నారు.
