సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకాశ్ రాజ్ , బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 3ఏళ్ళు క్రితం తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’ ఎన్నో కష్టాలు అధిగమించి ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు ప్రదర్శించిన ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రంపై.. విడుదలకు ముందు, విడుదల తర్వాత అద్భుత చిత్రంగా ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమాను నాటక రంగ కళాకారుల నేపధ్యంలో.. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి భావనతో ఉన్నారనే వాస్తవికతను తెలియజేసే ప్రయత్నం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టేలా.. హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో కృష్ణవంశీ ఈ చిత్రాన్ని మలిచారు. అయితే, థియేటర్లలో ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి కనబరచలేదు. అందుకే ఇప్పుడు నేటి శుక్రవారం నుండి ఓటీటీలోకి ఈ సినిమాని తీసుకొచ్చేశారు. ‘రంగమార్తాండ’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ మాత్రం ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *