సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గుండెపోటుతో వర్మ ఆసుపత్రిలో చేరి కాస్త కోలుకొని తదుపరి, ఇంటిపట్టున విశ్రాంతి తీసుకొంటున్న భీమవరంలో ప్రముఖ స్వయం సేవకుడు చెరుకువాడ రంగసాయి ని ఇప్పటికే ఎందరో ప్రముఖులు పరామర్శించడం జరిగింది. అయితే నేడు, మంగళవారం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆయన ను పరామర్శించి త్వరగా ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని అభిలషించారు. గ్రంధి శ్రీనివాస్ తో పాటు తోట బోగయ్య, పలువురు మాజీ కౌన్సెలర్స్ కూడా వెళ్లి పరామర్శించారు.
