సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఉండి లో కూటమి బలపరచిన టీడీపీ అభ్యర్థిగా నేటి శనివారం ఉదయం ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో కలవపూడి, మోడీ, S.C. బోసు కాలనీ, వాయిదాలపాడు గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యలను వీలైనంత త్వరగా తీరుస్తానని హామీ ఇచ్చారు. నేడు, మధ్యాహ్నం నిర్వహించిన రచ్చబండ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలో మద్యం పై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. ఇక ఉండిలో రామరాజు తో కలసి నిర్వహిస్తున్న ప్రచారంలో ప్రజలు తనకు బ్రహ్మరధం పడుతున్నారని, ఇటీవల టీడీపీ నుండి బహిష్కరించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శివరామరాజు తాను ఇండిపెండెంట్ అభ్యర్థిని ప్రచారం చేసుకుంటున్నారని, ఇప్పటికే ఈ విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా రఘురామ వివరించారు. ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార పోస్టర్లపై కలిదిండి అబ్బయ్యరాజు, ఎన్టీ రామారావు ఫోటోలను వేసుకోవడం భావ దారిద్రమేనని కృష్ణంరాజు విమర్శించారు. శివరామరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నా మెజారిటీ ని తగ్గించలేరన్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడ్ని అని చెబితే, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేవారు బ్యాలెట్ పేపర్ లో మొదటి స్థానంలో ఉన్న సైకిల్ గుర్తుపైనే వేస్తారని, దానివల్ల లాభమే కానీ నాకు నష్టం లేదన్నారు.
