సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉపసభాపతి, రఘురామా కృష్ణంరాజు చొరవతో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భీమవరం- గుడివాడ ప్రధాన రహదారి రోడ్డు లో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం కోపల్లెలో రాష్ట్రీయ రహదారిపై శిథిలావస్థకు చేరుకున్న పాత వంతెన స్థానంలో నూతన వంతెన ఏర్పాటు చేసేందుకు తాను గత కొన్ని నెలలుగా చేస్తున్న కృషి ఫలించిందని, ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, వీలైనంత త్వరగా ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని రఘురామ..తెలిపారు. తన ప్రతిపాదనకు నిధులు మంజూరుకు సహకరించిన సీఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *