సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండిలో స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు అంబేడ్కర్ ఫ్లెక్సీ తొలగించారని ( అయన నాగేంద్ర దేవాలయానికి అడ్డుగా ఉన్న కర్ర మాత్రమే తీసానని ఫ్లెక్సీ ముట్టుకోలేదని వివరణ ఇచ్చారు ) ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణ జిల్లాలోని దళిత సంఘాలు భగ్గుమన్నాయి. గత ఆదివారం మధ్యాహ్నం ఏలూరుపాడులో పెద్దఎత్తున దళిత నాయకులు అంబెడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని రాష్ట్రీయ రహదారిపై సుమారు 3గంటలు పైగా ధర్నా నిర్వహించారు.RRR డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనికి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఏలూరుపాడులో దళిత నాయకులకు సంఘీభావం తెలిపారు. అంబేడ్కర్‌ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపైౖ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఫ్లెక్సీ నిజంగా గుడికి అడ్డుగా ఉంటే అధికారులతో చెప్పి తొలగించవచ్చని దౌర్జన్యంగా ఫ్లెక్సీని తొలగించడం పద్ధతి కాదన్నారు. గత ఆదివారం సాయంత్రం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత నేతలు నల్లి రాజేష్ ,గంట సుందర్ కుమార్ ఆధ్వర్యంలో RRR ఫై పిర్యాదు చేసారు.
