సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయం ఉద్రిక్తతల నేపథ్యంలో గత 3 రోజులుగా 144 సెక్షన్‌ విధించారు. పట్టణం అంతటా సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నారు. శిథిలావస్థకు చేరిన రామాలయం పరిసరాలకు ఎవరూ వెళ్లకుండా బారికెట్స్ కట్టారు. నిన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెళ్ళడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారులు వద్దని వారించడం జరిగింది. అల్లర్లకు కారణమైన 57 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేశారు. శనివారం భీమవరం కోర్టుకు వారిని హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించింది.ఇదిలా ఉండగా ఈ ఘటనలో గాయపడిన బాధితులను నేడు, భీమవరం ఆసుపత్రిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పరామర్శించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు శ్రీరామనవమి సందర్భంగా పెదపేటలోని ఆలయంలోకి వెళ్లి రాముడి విగ్రహానికి పూలమాల వేయడానికి వీలు లేదంటూ అన్య మతస్తుల పేరిట కొందరు రఘురామపై దాడికి యత్నించడంతో దారుణమైన విషయం అని హిందువులపై చేసిన దాడిని ఎవరు సహించలేకపోతున్నామని ఎవరిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *