సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఇటీవల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుపై అసభ్యకరముగా,వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ.. నేడు, శుక్రవారం భీమవరం సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.గోపాలన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావుల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వారి మాటలలో తోరాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నత మైన గౌరవస్ధానంలో ఉండి ఎమ్మెల్యే గా హూందాతనంను ప్రదర్శించవలసిన రఘురామా కృష్ణంరాజు ఇటీవల పేదల ఇళ్ళు తొలగింపు ను అడ్డుకొంటున్న తమ సిపిఎం నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబుకాదన్నారు. వెధవ సొల్లు, పిచ్చికుక్క వంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ తమ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ను దూషణలతో బతికిపోయావంటూ బెదిరిస్తూ చేసిన తాటాకు చప్పుళ్ళకు కమ్యూనిస్టులు ఎవరు బెదిరిపోరన్నారు. దీనికి క్షమాపణ చెప్పాలన్నారు. రఘురామా.. సిపిఎం మంచి పార్టీ, నేను గౌరవిస్తాను అంటూనే నోరు పారేసుకోవడం దారుణం అన్నారు. గత ప్రభుత్వం రఘురామా ను అరెస్ట్ చేసినప్పుడు సిపిఎం ఆయన అక్రమ అరెస్ట్ ఫై పోరాడిన ఘటన గుర్తు ఉందా ? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఎంపీ గా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏం చేశాడో చెప్పగలరా? పెద్దలు చేసిన ఆక్రమణలు కనిపించవు.. కాలుష్య నివారణ కోసం అంటూ గుడిసెలు పీకేసి అభివృద్ధి అంటే ఎవరూ హర్షించరన్నారు.
