సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ను కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును విజయ్‌పాల్‌ ఆశ్రయించారు. అయితే దీనిపై ధర్మాసనం నేడు సోమవారం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, విజయ్‌పాల్‌ తరఫు న్యాయవాదులు సుధీర్ఘ వాదనలు విన్న అనంతరం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరలే ధర్మాసనం విజయపాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రఘురామ హర్షం వ్యక్తం చేశారు. విజయ్ పాల్ తనను దారుణంగా చిత్రవధ చేశారని.. చంపాలని చూసారని అన్నారు. అందుకు సాక్ష్యంగా మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు. న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *