సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో .. కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీం కోర్టు నేడు, మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సీఐడీ కస్టడీలో రఘురామా కు ఎటువంటి గాయాలు కాలేదని నివేదిక ఇచ్చిన డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందే అని సుప్రీం తేల్చి చెప్పింది.ఈనెల 7, 8 తేదీల్లో జరిగే విచారణకు, డాక్టర్ ప్రభావతి ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర బెయిల్ రద్దు అవుతుందని న్యాయస్థానం తెలిపింది. ప్రభావతి విచారణకు ఎలా సహకరించడం లేదో అనే విషయాన్ని ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సాక్ష్యాలు చూపిస్తూ సుప్రీం కోర్టు ముందు వాదించారు. .ప్రతీసారి ఏదో ఒక సాకుతో ప్రభావతి విచారణకు హాజరుకావడంత లేదని.. అందువల్ల ఆమెకు ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభావతి విచారణకు సహకరించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 15కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
