సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై గతంలో ఆయన ఎంపీగా ఉన్నపుడు సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి అయ్యారని అయన వంటిపై గాయాలు ఉన్నాయన్న రిపోర్టును మార్చివేసి ఎటువంటి గాయాలు కాలేదని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ విచారణలో డాక్టర్ ప్రభవతికి హైకోర్టులో నేడు, శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఉండి ఎమ్మెల్యే రఘురామ.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
