సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 73 ఏళ్ళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆరోగ్యం మరోసారి తిరగబెట్టింది. తీవ్రమైన కడుపునొప్పితో గత రాత్రి ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. నేటి మంగళవారం ఉదయం వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది మరో మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రజనీకాం త్ , అమితాబ్ నటించిన ‘వేట్టయాన్’, ‘కూలీ’ సినిమా ఈ అక్టోబర్ 10న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *