సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కేరళ రాష్ట్రం కొచ్చిలో సూపర్ స్టార్ రజనీకాంత్ టీ అమ్ముతుండటం సోషల్ మీడియాలో తెగ ప్రచారులు చేస్తుంది. . వీడియోలో రజనీకాంత్ రహదారి పక్కన టీషర్ట్ చొక్కా , షార్ట్ లో కనిపించాడు. అందరు షాక్.. అయితే జాగ్రత్తగా గమనిస్తే నిజానికి అతను రజని కాంత్ కాదు.. ఆబట్టతల తలకట్టు, రూపం అచ్చం రజనీ లాగే ఉండటంతో ఆయన్ను చూసినవారు షాకవుతున్నారు. అతను ఎవరితోనో మాట్లాడుతూ అచ్చు రజని తరహాలోనే జుట్టును రెండుచేతులతో అలా సవరించడం, తరువాత కరచాలనం చేయడం భలే సరదాగా ఉంది. ఇదేమైనా కొత్త సినిమా షూటింగ్ లో భాగమేమో అనుకున్న వారు కూడా ఉన్నారు. సడన్ గా చూసి రజనీకాంత్ అనుకోని వ్యక్తి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంత దగ్గరి పోలికలు ఉన్నాయి . కానీ ఇతను కొచ్చిలో టీ దుకాణం పెట్టుకుని టీ అమ్ముతుంటాడట. అది సంగతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *