సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ (Jailer) సినిమా ఘనవిజయం సాధించింది. ఆ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కాసేపు తెరపై ప్రత్యక పాత్రలలో ప్రేక్షకులకు బోనస్ గిప్ట్ ఇచ్చారు. ఆయా దక్షిణాది రాష్ట్రాలలో .. వారు స్క్రీన్ పై కనిపించగానే థియేటర్లు మారుమోగిపోయాయి… ప్రస్తుతం జైలర్ సీక్వెల్ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఈ సెకండ్ పార్ట్ లో అంతకు మించి ఉండాలని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్ తో నటించని మాస్ హీరో అయితేనే సదరు సన్నివేశాలు రక్తి కడుతుందని నెల్సన్ అభిప్రాయం…అందుకు వారు తెలుగు సినిమా కు ‘మాస్ అఫ్ గాడ్’ గా పిలవబడుతున్న బాలకృష్ణ ను సంప్రదించారు. అదీగాక బాలయ్య డబ్బింగ్ సినిమాలతోనే ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించారు… అందువల్ల ఆయన ఉంటే ‘జైలర్ 2’కు మరింత ప్లస్ అని భావిస్తున్నారు. త్వరలో మిత్రులు రజనీ కాంత్ తో బాలయ్య ప్రత్యేక పాత్రలో మెరవబోతున్నారని అధికారిక ప్రకటన రాబోతుందని ఫిలిం నగర్ సమాచారం
