సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జైలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) జైలర్ 2 (Jailer 2) మాత్రం మరోసారి సరికొత్త పాన్ ఇండియా మల్టీస్టార్ కాంబినేషన్ తో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్రూపొందిస్తున్న ‘జైలర్ 2’ మూవీలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), మళయాళ సూపర్ స్టార్, మోహన్ లాల్ (Mohanlal), కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shivarajkumar) కనిపించబోతున్నారు. ప్రస్తుతం బేగంపేట్‌లో జరుగుతున్న షూటింగ్ లో ఈ నలుగురు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తీస్తున్న ‘జైలర్ 2’కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మరోసారి సంగీతం అందిస్తున్నారు. మరి ర‌జ‌నీకాంత్ త‌న సినిమాలో తెలుగు హీరో లేక పోవ‌డంపై ఇక్క‌డి అభిమానులు చాలామంది నిరుత్సాహ ప‌డుతున్నారు. మొద‌ట్లో ఈ సినిమాలో బాల‌కృష్ణను తీసుకుందామ‌ని అనుకున్న‌ప్ప‌టికీ ఎందుక‌నో అయన సినిమాకు దూరంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *