సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోడీతో సహా దేశ విదేశీ ప్రముఖులు సంతాపాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ , ఉప ముఖ్యమంత్రి పవన్ తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. రతన్ టాటా పార్థివ దేహానికి నేటి మధ్యాహ్నం అంత్యక్రియలలో పాల్గొనడానికి ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నిర్ణయించారు. నేడు 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకోనున్న సీఎం చంద్రబాబు, లోకేష్… 3 గంటలకు నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సీపీఏ లాన్స్‌లో రతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. తిరిగి 3:30 గంటలకు అమరావతికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.
