సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్ ట్లు ప్రకటిం చారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్ల రూపాయలు మార్చుకొనేందుకు మరొక్క ఛాన్స్ ఇస్తారని చాల కాలంగా ఎందరో ఇప్పటికి ఎదురు చూస్తున్న మాట వాస్తవం.. అటువంటి వారి ఆశలను సజీవం చేస్తూ ఇటీవల కొందరు పేక్ వార్తలు సృష్టిస్తున్నారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్ప టికీ తమవద్ద ఉన్న పాత ఇం డియన్ కరెన్సీ నోట్లను మార్చు కోవచ్చని పేర్కొం టూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెటర్ ఇటీవల సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. దీనిపై దర్యాప్తు చేసిన భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చు కునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని మరో అవకాశం రాలేదని తెల్పింది. .
