సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్నాడు లో వైసీపీ నేత ఆత్మహత్య నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శ కు వచ్చిన జగన్ పర్యటనలో ఉత్సహం ఎక్కువయిన వైసీపీ కార్యకర్తలు పలు వివాదాస్వాద ఫ్లెక్సీ బోర్డులతో సంచలనం సృష్టించారు. ఆ బోర్డులలో ఏమి ఉందంటే.. మళ్లీ వైసీపీ అధికారం లోని వచ్చిన వెంటనే.. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు.. రప్పా రప్పా నరుకుతాం నా కొ..! పల్నాడు నుంచి మొదలు, అన్న వస్తాడు.. అంతు చూస్తాడు!’ అంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇలాంటి రాతలపై హోమ్ మంత్రి తో సహా టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాటిని మంత్రి లోకేష్ కూడా తన ట్విటర్ లో పోస్టు చేసి.. ఏమిటి? రప్ప! రప్ప! అంటూ ప్రజలను భయబ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అధికారం పోయిన కూడా వైసీపీ నేతలకు ఎక్కడి నుండి ఈ దైర్యం వస్తుందని ?ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిన్న జగన్ పర్యటనలో పోలీసులు అడ్డుగా పెట్టిన బారికెట్స్ ను విసిరి పాడేసి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ , డీజే స్టాండ్ ఏర్పాటుపై కూడా కేసు నమోదు అయ్యింది.
