సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ సోదరుడు రమేష్ బాబు (56) ఆకస్మిక మరణంతో సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. కొంతకాలం క్రితం విజయనిర్మల ను కోల్పోయిన షాక్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న కృష్ణ పెద్ద వయస్సు కావడం తో పెద్ద కొడుకు రమేష్ బాబు మరణవార్త విని షాక్ నుండి ఇంకా తేరుకోలేదని తెలుస్తుంది. ఇక తమ్ముడు మహేష్ బాబు కు కరోనా పాజిటివ్ కావడంతో ఆయన తన రూమ్ నుండే సోదరుడి అంత్యక్రియల ఏర్పాట్లు బాబాయి ఆదిశేషగిరి రావు సహకారంతో లైవ్లో చూస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఆయన భార్య నమత్రా, పిల్లలు మాత్రం రమేష్ బాబు భౌతిక కాయానికి నివాళ్లు అర్పించారు. రమేష్ బాబు తల్లి ఇందిరా విషాదం లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో రమేశ్ బాబుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఘట్టమనేని రమేష్ బాబుకి.. హీరోలు చిరంజీవి ,పవన్ కళ్యాణ్ తో పాటు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నివాళులు అర్పించారు. మరికాసేపట్లో మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *