సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హీరో మాస్ మహారాజా ‘రవి తేజ మొదటి పాన్ ఇండియా సినిమాగా భారీ అంచనాలతో నేడు, శుక్రవారం రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి నూతన దర్శకుడు వంశీ , ఈ సినిమా డెబ్బయి దశకంలో దొంగల ఊరుగా ప్రసిద్ధి పొందిన స్టూవర్టుపురం అనే గ్రామానికిచెందిన నాగేశ్వర రావు అనే దొంగ యదార్ధ గాధ అని ప్రచారం కూడా చేశారు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో నటించారు. . అలాగే ఈ సినిమాలో నుపుర్ సనన్ ,గాయత్రీ భరద్వాజ్ కథానాయికలు. ఇటీవల లక్కీ నిర్మాతగా పేరున్న అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వున్న ఈ సినిమా కధ ఎలా ఉందంటే.. నాగేశ్వర రావు (రవితేజ) దొంగలకు ప్రసిద్ధి పొందిన స్టూవర్టుపురానికి చెందిన దొంగ. ఇతగాడి ప్రత్యేకం ఏంటంటే, ఎక్కడ దొంగతనం చేసినా ముందు చెప్పి వెళతాడు, విజయవంతంగా దొంగతనం చేస్తాడు. చిన్న తనంలోనే తండ్రి తల నరుకుతాడు నాగేశ్వర రావు, ఇలా దొంగతనాలు చేస్తూ డబ్బు గడించి ఆ ఊరి ప్రజలకు, పిల్లల చదువులకు ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఆ వూర్లో ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టాలని, అందులో తన ఊరి ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలో నాగేశ్వర రావు అడ్డంకులు దాటుకొని తన ఆశయాన్ని ప్రధానమంత్రి వరకు ఎలా తీసుకెళ్లగలిగాడు? అన్నది 3గంటల సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. దర్శకుడు వంశీ, సినిమాను హ్యాండిల్ చెయ్యడంలో తడబడ్డాడు . కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ నాగేశ్వర రావు దొంగతనం చేసే టాలెంట్, టెక్నీక్ చూపించడం మిస్ అయ్యాడు. ట్రైన్ దొంగతనం మరీ చిన్నపిల్లల గ్రాఫిక్ లా తీశారు. అలాగే నాగేశ్వర రావు ప్రధానమంత్రి ఇంట్లో దొంగతనం చేస్తాడు, అది కూడా సాదాసీదాగా ఉంది. హీరో రవితేజ మాత్రం నాగేశ్వరరావు పాత్రలోకి యువకుడిగా వెళ్ళాడు.తెరపై అతని కష్టం కనిపించింది. అనుపమ్ కేర్ పాత్ర పర్వాలేదు. నాజర్, రేణు దేశాయి పాత్రలు నిడివి తక్కువే..సినిమా. రెండో సగంలో తలలు, మొండాలు,కాళ్ళు తెగి పడుతూ ఉంటాయి,బ్యాక్ గ్రౌండ్ బాగున్నప్పటికీ పాటలు గుర్తుకురావు.. హింస పాళ్ళు ఉన్నపటికీ మాస్ ప్రేక్షకులను కొంతమేర సినిమా అలరిస్తుంది.
