సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం తెలుగునాట హిట్ కాగా దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ బంపర్ హిట్ కావడంతో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లో యూత్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యింది.పుష్ప మేనరిజం అక్కడ పెద్ద పాపులర్ అయ్యాయి. ఇక రష్యన్ భాషలో డబ్ చేసి వందలాది థియేటర్స్ తో రష్యాలో డిసెంబరు 8న విడుదలవుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం గత బుధవారం రష్యాకు చేరుకున్న చిత్రబృందానికి రష్యన్లు నుండి ఘన స్వాగతం లభించింది. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్‌లో నేడు, గురువారం జరిగే ప్రీమియర్‌లో అల్లు అర్జున్, రష్మిక, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నిర్మాత రవిశంకర్ పాల్గొంటారు. ఇప్పటికే రష్యన్ భాషల్లో పుష్ప సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తుంది.
