సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2022 నుండి గత 3 ఏళ్లుగా జరుగుతున్నా రష్యా ఉక్రెయిన్ ల మధ్య నెల రోజుల తాత్కాలిక యుద్ధ విరమణ దిశగా అడుగులు పడటంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. రష్యా అడ్జక్షుడు పుతిన్ ఈ సందర్భముగా ఉక్రెయిన్‌ అంశంపై దృష్టి సారించినందుకు అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ లకు కృతజ్ఞలు మీడియా ముందు తెలిపారు. ఘర్షణలు సద్దుమణికి మనుషుల ప్రాణాలను కాపాడే ఉదాత్తమైన లక్ష్యం దిశగా పనిచేస్తు్న్న వారందరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. దీనివెనుక చరిత్రలోకి వెళ్ళితే.. నాటో దేశాల కూటమిలో చేరవద్దని 3 దశాబ్దాల క్రితం తన నుండి విడిపోయిన ఉక్రెయిన్ ను రష్యా హెచ్చరించిన ప్రయత్నాలు మనకపోవడంతో రష్యా తిరిగి ఉక్రెయిన్ ను తనలో కలిపేస్తుకోవడానికి ఆక్రమణ కు దిగి ఇప్పటికే సుమారు 30 శాతం భూభాగాన్ని? రష్యాలో కలిపేసుకొన్న నేపథ్యంలో వేలాది సైన్యం ఇరుపక్షాలలో మరణించిన నేపథ్యంలో.. ఉక్రెయిన్‌ కు యుద్ధ సాయం చెయ్యడానికి అమెరికా అడ్జక్షుడు ట్రాంప్ దూరంగా జరిగిన నేపథ్యంలో.. ఉక్రెయిన్ కూడా రాజీకి వచ్చింది. గతంలో భారత ప్రధాని మోడీ రాజీ చేసుకోమని చేసిన సూచన త్రోసిపుచ్చి ఉక్రెయిన్ అడ్జక్షుడు జలన్సీకీ చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించారు.యుద్ధ సమయంలో రష్యా ను యుద్ధ ఆంక్షలు తో ఇరుకున పెట్టాలన్న అమెరికా యూరప్ దేశాల ప్యూహానికి భారత్ అడ్డుగా నిలబడి రష్యా తో తన సుదీర్ఘ మిత్ర ధర్మం పాటించింది. దీనితో తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరు దేశాల దాయాదుల దగ్గరకు వెళ్లి సర్దుబాటు మాత్రేమే తప్ప ఇది యుద్ధం కాలం కాదు అని చెప్పిన ప్రధాని మోడీకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *