సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ ఫై అమెరికా 25 శాతం అదనపు సుంకాలు ను ప్రస్తుతానికి ఈ ఆగస్టు 7వరకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అది నిజమైతే మంచి నిర్ణయమని కామెంట్ చేశారు. ‘రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లు నిలిపి వేసిందని నేను విన్నాను. అది నిజమో కాదో మాత్రం నాకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతోందో… చమురు కొనుగోళ్ల నిలిపివేత మంచి నిర్ణయమే’ అని ట్రంప్ అన్నారు.ఈ వార్తలపై భారత విదేశాంగ శాఖ కూడా నర్మ గర్భంగా స్పందించింది. భారత ఇంధన దిగుమతులు.. మార్కెట్ పరిస్థితులు, జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది.అయితే భారతీయ ఆయిల్ కంపెనీలు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్టు తమ దృష్టికి రాలేదని ప్రకటించింది. ఇటీవల అమెరికా భారత్ ఫై రష్యా చమురు కొనుగోళ్లపై అదనపు పెనాల్టీలు కూడా విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెనాల్టీ ఎంత అనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి భారత్ దూకుడు తగ్గించి ప్యూహాత్మకంగా ఆలోచిస్తుంది.
