సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా జరుగుతున్నా రష్యా- ఉక్రెయిన్ దాయాది దేశాలయుద్ధంలో తాజాగా నేడు, సోమవారం జరిగిన ఘోరమైన దాడిలో 1000 మంది ఉక్రెయిన్ సైనికులు అసువులు బాసారు. రష్యా ఆధీనం లో ఉన్న డొనెట్స్క్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్ బలగాలు 35సారులు దాడులు చేసి రెచ్చగొట్టినందుకు రష్యా అద్జ్యక్షుడు పుతిన్ ఆగ్రవేశాల నేపథ్యంలో రష్యా భారీ క్షిపణులతో విచక్షణారహితంగా దాడి చేసి 1000 మంది ఉక్రెయిన్ బలగాలను బలిగొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ తాజగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదం లో ఒకేరోజు భారీగా ప్రాణ నష్టం జరిగిందని ఉక్రెయిన్ వర్గాలు కూడా ప్రకటించాయి. గెలుపు ఎవరిదైనా యుద్ధం మానవ వినాశనాన్ని కోరుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
