సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే డిసెంబర్ 4మరియు 5వ తేదీలలో భారత్ లో 2 రోజుల పర్యటన ఖరారు అయ్యింది. 23వ భారతదేశం- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ-పుతిన్‌ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలపై చర్చిస్తారని భారత విదేశాంగ శాఖ నేడు శుక్రవారం ప్రకటించింది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా అధ్యక్షుడుని రాష్ట్రపతి భవన్‌కు స్వాగతించి, ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేయనున్నారు. అయితే రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై అదనపు భారీ సుంకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటను ప్రాధాన్యత సంతరించుకుంది. 2021 తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇండియాకు రావడం ఇదే తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *