సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ తనయుడు పాన్ ఇండియా హీరో రాంచరణ్ చిన్న హీరోలను ప్రోత్సహించేందుకు వి మెగా పిక్చర్స్ పతాకంపై చిత్రాలు నిర్మించడానికి నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. దీనికి యూవీ క్రియేషన్స్ విక్రమ్‌రెడ్డి ప్రొడక్షన్ పార్ట్‌నర్. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ వీరిద్దరితో చేతులు కలిపారు. నిఖిల్ హీరోగా నిర్మించే తొలి చిత్రం ‘ది ఇండియా హౌస్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించనున్నారు. 1905వ సంవత్సరం నేపథ్యంగా ప్రేమ, విప్లవం అంశాలతో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ హంపీలోని విరూపాక్ష దేవాలయంలో ప్రారంభమైంది. నేటి మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది
