సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం కోస్తా ఆంధ్రాలో ముఖ్యంగా గోదావరి జిల్లాలలో , నెల్లూరు జిల్లాలో తీవ్ర పెనుగాలులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. అంబేద్కర్ కోనసీమ లో రాజోలు, తాటిపాక లలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక విశాఖ వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం రాగల 24 గంటలలో మరోసారి పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని కోస్తా ఆంధ్ర తీరంలోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది.
