సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం రాజంపేటలో ఒక విభిన్న కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి గా పోటీచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు హాజరు అయ్యారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ఆరాచక శక్తులను ఉపేక్షించకూడదన్నారు. ఈసారి ఇక్కడ వైసీపీ ఎంపీ మిదున్ రెడ్డి ఫై సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుండి వచ్చిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారని గతంలో రాజంపేటలో ఇంత ఉత్సాహాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే రాజంపేటలో విజయోత్సవ సభ పెడతామన్నారు. మీకు జగన్ న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. బాధితులకు జగన్ కనీసం ఇళ్లు కట్టించారా? అని నిలదీశారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే వైసీపీ నేత మిథున్‌రెడ్డి ఓడిపోవాలన్నారు. తాము వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడతామని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనదయిన శైలీ లో వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం అన్నారు. రాష్ట్రంలో జగన్ ఏకంగా 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని అదే అతని ఓటిమి కి దారి చూపుతుందన్నారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి పిఠాపురం వచ్చి తనను ఓడిస్తారట? అని విమర్శించారు
