సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ కురువృద్దులు.. మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్తు చైర్మెన్ , ప్రముఖ రైతునేతగా అల్ రౌండర్ గా ప్రజలకు , రైతులకు విశేష సేవలు అందించిన యర్రా నారాయణస్వామి నేటి బుధవారం సాయంత్రం కన్నుమూశారు, వృధాప్య సమస్యలతో భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామమైన ఉప్పులూరుకు తరలించనున్నారు. యర్రా.. రాజకీయాల నుండి విరమణ తరువాత గత దశాబ్దం పైగా భీమవరం లోనే నివాసం ఉంటూ రైతు, స్వచ్చంధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు,ఆయన మృతికి ఇప్పటికే జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు,రాజకీయా, రైతు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాంపం తెలుపుతున్నారు,
