సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేటి మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగింది.( పవన్ వచ్చిన కొద్దీ సేపటికే ఆయన తల్లి అనారోగ్యం వార్త రాగానే వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారు). ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రి మండలితో చర్చించి ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతి కోసం రెండో విడత భూసేకరణను కాబినెట్ ఆమోదించింది. రాజధానిలో గతంలో సేకరించిన 30 వేల ఎకరాల పైగా వ్యవసాయ భూమికి తోడు మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. పోలవరం బనకచర్లపై తెలంగాణ కేబినెట్‌లో మంత్రులు డిస్కస్ చేశారని ఏపీ కూడా మన వాదనలు వినిపించాలని సూచించారు సీఎం చంద్రబాబు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌పై మనం దశల వారిగా ముందుకు వెళ్తామని సూచించారు. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని వివరించారు.
