సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అమరావతిలో పర్యటించారు.అయన ఎర్రబాలెంలో కొత్తగా ఇటీవల భూములు ఇచ్చిన రైతుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ..అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం అవుతున్నాయని గతంలో రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారని చెప్పారు. భూములు ఇచ్చే రైతుల ఇంటికి నేరుగా తానే వస్తానని చెప్పానని అన్నారు. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్స్ ఇచ్చామని, అయితే ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు బహిరంగ ఆఫర్ ఇస్తున్నామని, వారికి కావాల్సిన చోట, ఎక్కడ భూమి ఉందో అక్కడ వారు కోరుకున్న చోట ఫ్లాట్స్ ఇవ్వనున్నామని తెలిపారు. అలాగే, రైతులకు అందాల్సిన రెండు వార్షిక కౌలును అందిస్తామని చెప్పారు. ముందుగా ఒక కౌలును త్వరలోనే అందిస్తామని అన్నారు. గత వైసీపీ సర్కారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హేళన చేసిందని ఇకపై తాము కేంద్రం సహకారంతో ముందుకు వెళుతున్నామని అన్నారు.
