సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా ప్రిన్స్ రామ్ చరణ్ తేజ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్, అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన లో జనవరి 10 న రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజెర్ సినిమా నేపథ్యంలో .. నేడు, శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రౌండ్‌లో జరిగే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తున్నా నేపథ్యంలో సభా వేదిక వద్ద ట్రాఫిక్ విధానాలను పరిశీలించడానికి మంత్రి దుర్గేష్ తో పాటు జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్, ఏఎస్పీలు ఏబీఎన్ మురళీకృష్ణ, సుబ్బరాజు, డీఎస్పీలు భవ్యకిషోర్, దేవకుమార్, రమేష్, పలు స్టేషన్ల సీఐలు, ఎస్ ఐలతో సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి కూడా విశేషంగా మెగా అభిమానులు వస్తున్నారు. సుమారు 2 లక్ష మంది పైగా మెగా అభిమానులు ఈ ఈవెంట్‌ను తిలకించడానికి వస్తారని అంచనా.
