సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో నేడు, మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇటీవల అమెరికాలో అడవుల దహనం తరహాలో రాజమండ్రి నుంచి ఏకంగా రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో అటవీ ప్రాంతంలో పొగ భారీగా వ్యాపించింది. చక్రద్వారా బంధం గ్రామ సమీపంలో మంటలు వ్యాపించాయి. దాంతో గ్రామస్తులతోపాటు రైతులు తీవ్ర భయాందోళను చెందుతోన్నారు.వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వందలాది ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ అంతా జామాయిల్ తోటలతో నిండి ఉంటుంది. అని అక్కడి వారు అంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు
