సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్రవరం నేడు సోమవారం ఉదయం ఎక్కడ చుసిన కమలం పువ్వు కాషాయరంగు జెండాలు బీజేపీ ఫ్లెక్సీలతోపండుగ వాతావరణం కళకళలాడింది. .. రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం తొలిసారిగా ఇక్కడ మంజీరాలో నేటి సోమవారం ఉదయం ప్రారంభమయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయాలు సాధించడం.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు. ముగ్గురు ఎంపీలు గెలిచిన సంగతి తెలిసిందే.అంతే కాదు కేంద్రంలో కూడా మోదీ మూడోసారి ప్రధాని కావడం కూడా ఈ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కల్పిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం లో నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 34 ఏళ్ళు నిబ్బద్దత గా పనిచేసిన కార్యకర్త కేంద్ర మంత్రిగా ఎదగటం పార్టీలో ఆయన రోల్ మోడల్ గా నిలిచారు. ఇక ఈ కీలక సమావేశంలో నేతలు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చెయ్యడం .. రాష్ట్ర విభజన అంశాలు .. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్రం అభివృద్ధి కోసం ఇక్కడ ఏ ఏ అంశాలపై చర్చించనున్నదనేది చర్చిస్తున్నారు. 2రోజులు జరిగే ఈ సమావేశాలలో కేంద్రమంత్రులు కె.మురుగన్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సోము వీర్రాజు, పాక సత్యనారాయణ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. .బీజేపీ అసెంబ్లీ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు సుమారుగా 2,250 మంది పాల్గొనే అవకాశం ఉంది.
