సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ సినిమాలలో నెంబర్ వన్ గా రాణిస్తున్న హాలీవుడ్ ఫాంటసీ సినిమాల ” అవతార్” దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకధీరుడు రాజమౌళిపై ఆస్కార్ వేదిక తరువాత తాజగా .. మరోసారి ప్రశంసలు కురిపించారు. 51వ వార్షిక శాటర్న్ అవార్డుల వేడుక ఇటీవల అమెరికాలో ఘనంగా జరిగింది. దీనికి హాజరైన జేమ్స్ కామెరూన్ గత ఏడాది భారతీయ దర్శకుడు రాజమౌళితో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఆయన ‘‘ఆర్ఆర్ఆర్’అద్భుతం చేశారు. ఆయన్ను కలవడం ఎప్పటికీ మర్చి పోలేను. ప్రపంచవేదికపై ఇండియన్ సినిమాను చూడడం ఆనందం గా అనిపించింది’ అని చెప్పారు. ఆ సినిమాలో గ్రాఫిక్స్ మాత్రమే కాదు కథలో ఉన్న ప్రతి పాత్రను చాలా బాగా బలంగా చూపించారని.. రాజమౌళి కధ చెప్పడంలో షేక్స్పియర్ను మరపించారని అన్నారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో నిర్మిస్తున్న పాన్ వరల్డ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నా రు. ఈ చిత్రం ‘ఇండియానా జోన్స్’లా ఉండనుంది. ఇందులో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి పాత్రలో మహేశ్ కనిపిస్తారు. 1000 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రికార్డ్స్ బ్రద్దలు కొట్టాలని , మహేష్ ను హాలీవుడ్ సూపర్ స్టార్ గా మార్చెయ్యాలని రాజమౌళి కసి తో పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *