సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా రూపొందించి హాలివుడ్ సినిమాల రికార్డ్స్ బ్రద్దలు కొట్టే పనిలో బిజీగా ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి గతంలో ప్రభాస్ హీరోగా రూపొందించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా విడుదలై బాక్సా ఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బాహుబలి-3’ ఉంటుందంటూ ప్రచారం జరిగింది. తాజాగా చిత్ర దర్శకుడు రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ‘బాహుబలి, క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రాబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఇం దుకు సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుందని ప్రకటించారు.‘మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పు డు, ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది’ అని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. మరి ఇందులో ప్రభాస్ రూపంలోనే బాహుబలి ఉంటాడా? శివగామి, కట్టప్ప , అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవుడు, దేవసేన పాత్రలు ఉంటాయా? వాటితో పాటు ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యున్నత స్థాయిలో ఈ యానిమేటెడ్ సిరీస్ ఉంటుందని అందరు భావిస్తున్నారు.
