సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్డీఏ కూటమి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా TDPకి చెందిన పేరాబత్తుల రాజశేఖరం నేడు, సోమవారం ఏలూరులో నామినేషన్ దాఖలు చేశారు. రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి కూటమి నేతలు భారీగా తరలివచ్చారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తోపాటు రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్,TDP రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, MLCలు పెద్ద సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఏలూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలి గా కలెక్టరేట్ కు వెళ్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ ను దాఖలు చేశారు.
