సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజస్థాన్లోని ఎడారి ప్రాంతం జైసల్మేర్ జిల్లాలోని మెహన్గఢ్లో ఓ వ్యక్తి తన స్థలంలో బోరుబావి వేసేందుకు యంత్రాలు తీసుకువచ్చి బోరుబావి తీస్తుండగా.. ఒక్కసారిగా గంగపైకి పొంగి వచ్చింది. భారీ ఉధృతితో నీరు ఒక జీవ నదిలాగా పైకి ఉబికిరావడంతో పెద్ద గుంత ఏర్పడి అందులో బోరుబావి తీస్తున్న యంత్రం సైతం పడిపోయింది. అక్కడ అడ్డు అదుపు లేకుండా ఈ నీరు అలా భూమి పైకి వచ్చి పెద్ద ప్రవాహం మొదలయింది. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్ అయ్యారు. దీనిని వీహెచ్పీ నేత వినోద్ బన్సల్ ట్వీట్ చేశారు. ‘నేడు ఎడారి కూడా నీట మునిగింది’ జైసల్మేర్ ఎడారిలో గతంలో అంతరించిపోయిన పురాతన తల్లి సర్వసతి నదియే ఈ ప్రవాహ ఉధృతికి కారణం.భూమి క్రింద ప్రవహిస్తున్న అంతర్వాహిని సరస్వతి నది బయటకు వచ్చింది అంటూ వినోద్ బన్సల్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు. మరి ఆ వీడియో దేశవ్యాప్తంగ వైరల్ అవుతుంది.
