సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు లో సినిమా వేరు రాజకీయం వేరు కాదు.. అంతా ఒక్కటే అన్నది అందరికి తెలిసిందే.. ఇక తమిళ సూపర్ హీరో విజయ్ తన అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కొత్త రాజకీయ పార్టీ పేరు నేడు, శుక్రవారం ప్రకటించారు తమిళ హీరో విజయ్ దళపతి. తన రాజకీయ ప్రవేశానికి ప్రధమ మెట్టుగా ఆయన ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో(EC) పార్టీ పేరు నమోదు చేశారు. పార్టీకి “తమిళగ వెట్రి కజగం”అనే పేరు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.విజయ్‌కి చెందిన మక్కల్ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే రాజకీయ పార్టీగా మార్చినట్లు తెలుస్తోంది.గతంలో 5 ఏళ్ళ క్రితం విజయ్ తండ్రి కూడా విజయ్ పేరుమీద రాజకీయ పార్టీ పెడితే అప్పుడు తండ్రి మీద కేసు వెయ్యడానికి సిద్ధపడిన విజయ్ ఇప్పుడు తానే నిజంగా రాజకీయ పార్టీ పెట్టేసాడు. ఇదిరా తమిళ రాజకీయం.. పైకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు అని చెబుతున్నప్పటికీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ పార్టీ బరిలోదిగే అవకాశం ఉంది.
