సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. చిత్రయూనిట్. గత రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈనేపథ్యంలో వేలాది డార్లింగ్ అభిమానులు హాజరు అయ్యారు. వారందరి సమక్షంలో డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. ప్రభాస్ ఇచ్చిన సహకారానికి జీవితాంతం రుణపడి ఉంటానని, అయన ఇచ్చిన అవకాశాన్ని సదివినియోగం చేసుకొన్నానని సినిమా రిలీజు అయ్యాక ఒక్క సీన్ సరిగ్గా తియ్యలేదని ప్రభాస్ అభిమానులు భావిస్తే హైదరాబాద్ లో తన ఇంటికి వచ్చేసి ముట్టడించేయవచ్చునని అడ్రెస్స్ తానే చెపుతానని భారీ భరోసా ఇచ్చారు.. ఒక దశలో బాగా ఎమోషనల్య్యి ఏడ్చేశారు. హీరో ప్రభాస్ వేదికపైకి వచ్చి ఓదార్చారు. అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడుతూ.. 3 ఏళ్ళ కష్టం మారుతి కన్నీరు రూపంలో బయటకు వచ్చిందన్నారు. సినిమా క్లయిమాక్స్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ చూడని విధంగా హైలైట్ అవుతుందన్నారు. ఒక దెయ్యం వేషం లో ఒక అమ్మాయి చేసిన యోగ భంగిమలు అందరికి మతి పోగొట్టయి. ఇక 250 కోట్ల భారీ ఖర్చుతో హార్రర్ కామెడీ డ్రామాగా రూపొందించిన రాజాసాబ్ చిత్రంలో ముఖ్య పాత్రలో సంజయ్ దత్ ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఈ సినిమాతో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ సైతం ప్రభాస్ జోడిగా కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *