సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి 18 నెలలు అవుతున్న నేపథ్యంలో .. రాష్ట్రంలో ఉన్న ఉభయ సభలలో అసెంబ్లీ లో ఎన్డీయే ఎమ్మెల్యేల బలం ఉంటె.. ఇప్పటికి ఏపీ శాసనమండలి లో వైసీపీ ఎమ్మెల్సీ లు బలం ఫై చేయ్యిగా ఉంది. చైర్మెన్ గా కొయ్య మోషేనురాజు దీమాగానే తన పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ కి అధికారం పోయిన వెంటనే అధికార టీడీపీ, బీజేపీ పక్షానికి చేరాలనే కుతూహలహంతో ( మరల ఆ పార్టీలు వీరిని ఎమ్మెల్సీ లుగా ఎన్నుకోవాలి) వైసీపీ ద్వారా వచ్చిన తమ పదవులకు రాజీనామా చేసిన 6గురు ఎమ్మెల్సీలు రాజీనామాలు ను సుదీర్ఘ కాలంగా శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆమోదించక పోవడంతో, వారు హైకోర్టు కు వెళ్ళటం.. తదుపరి పరిణామాలలో నేడు, సోమవారం వారు 6 గురు ఎమ్మెల్సీ లు .మండలి చైర్మెన్ మోషేను రాజు ముందు హాజరయి . తమ రాజీనామాను మరోమారు ఆమోదించాలని కోరుతూ వారి వాదనను వినిపించారు. మోషన్ రాజు వారిని, మీరు ఎవరి ప్రోద్భలం తో, ఎవరి ప్రేరణతో ఈ రాజీనామాలు చేసారు? పూర్తీ పదవి కాలంలో ఉండటానికి ఎందుకు ఇబ్బంది? పడుతున్నారు.రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా ?అని ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీతలను ప్రశ్నించారు. ఎవరి ప్రోద్భలం లేదని స్వచ్ఛందంగా రాజీనామా చేశామనే వారు వివరణ ఇచ్చారు. సుదీర్ఘ సమీక్షా తరువాత చైర్మెన్ మోషేను రాజు ఇక తన నిర్ణయం ప్రకటించవలసి ఉంది. నిజానికి 6 గురు రాజీనామాలతో మండలి లో వైసీపీ కి తగ్గే బలం నామమాత్రమే.. మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *