సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ లో మీడియాతో మాట్లాడుతూ.. తన పార్లమెంట్ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని అయితే .రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగాప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరొకసారి ఎంపీల మూకుమ్మడి రాజీనామాలకు ప్రతిపాదన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలుదామన్న ఆయన, ముగ్గురు టీడీపీ ఎంపీలను రాజీనామాకు ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రానికి చెందిన 25 ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా కేంద్రం పై వత్తిడికి తీసుకు వద్దామని సూచించారు. వైసిపి తనని పార్టీ సభ్యుడిగా పరిగణలోకి తీసుకోకపోయినప్పటికీ, తాను మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమేనని తెలిపారు .రాష్ట్రంలో ఇప్పటికే 50 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఐదవ తేదీ వచ్చినప్పటికీ, 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు , 75 శాతం మంది ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదని విమర్శించారు. , రేపు ఉపాధ్యాయులు సమ్మెకు దిగితే, విద్యార్థులకు పాఠాలను కూడా వాలంటీర్లతోటే చెప్పిస్తారా? అంటూ ఎద్దేవా చేసారు.
