సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల తిరుపతిలో నిర్వహిస్తున్నSV గోశాలలో ఇటీవల 100 కు పైగా ఆవులు చనిపోయాయని, ఫోటోలు చూపించి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు హిందూ ఆధ్యాత్మిక వాదులలో ఆందోళనలేపాయి. ముందుగా అవి నిరాధార ఆరోపణలు అని కొట్టి పారేసిన గట్టిగ ఒత్తిడి పెరగటంతో.. టిటిడి ఇఓ శ్యామల రావ్ ఒక ప్రకటనలో ఏవో కొన్ని ఆవులు మరణించడం సహజమేనని అంతే తప్ప 100 ఆవులు మరణించలేదని 43 ఆవులు మాత్రమే చనిపోయాయని, గత వైసీపీ హయాంలో సరియిన పోషక ఆహారం పెట్టకపోవడం వల్ల ఎన్నో ఆవులు చనిపోయిన ఘటనలు జరిగాయని, భూమన కరుణాకర రెడ్డి ఇటువంటి అసత్య ప్రచారం మానుకోవాలని లేకపోతె హిందూ సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే చట్ట పరంగా కేసులు పెడతామని హెచ్చరించారు. అయితే దీనికి భూమన కౌంటర్ గా తాను చేసిన ఆరోపణకు కట్టుబడి ఉన్నానని, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల గోవులు చనిపోతున్నాయని తాను ఆధారాలు చూపిస్తే… దానిని తిమ్మిని బమ్మిని చేసి చివరకు గత తమ వైసీపీ పాలనకు పాపం అంటగట్టాలని చూస్తున్నారని.. 100 పైగా గోవుల మరణాలకు సంబంధించి తాను చూపిన ఫోటోలలో ఎటువంటి మార్పింగ్ లేదని,దీనిపై విచారణకు సిద్దమేనా?నాది తప్పయితే ఏ శిక్ష కైనా సిద్ధం అని సవాల్ చేసారు. దీనితో బీజేపీ నేత, TTD బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఈ మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని.. పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు. కరుణాకర రెడ్డి TTDఛైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్య లో గోవులు చనిపోయాయి. గోవిందుడు, గోవులతో ఆటలు వద్దనివైసీపీ నేతలను హెచ్చరిస్తున్నాం అని ప్రతి సవాల్ చేసారు
