సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‍లో రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ నేడు, మంగళవారం పూర్తయింది. రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావులు.. అలాగే బీజేపీ నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నామినేషన్‍లు దాఖలు చేశారు. దీనితో ఇటీవల వైసీపీ కి రాజీనామా చేసిన ముగ్గురు అభ్యర్థులలో ఇద్దరికీ తిరిగి రాజ్యసభలో టీడీపీ , బీజేపీ స్థానం కల్పించాయి. అయితే టీడీపీ తరపున కొత్తగా సానా సతీష్ మాత్రమే రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. అయితే జనసేన తరపున పవన్ సోదరుడు నాగబాబు కు రాజ్యసభ ఇస్తారని ముందుగా భావించినప్పటికీ త్వరలో నాగబాబు ను రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా తీసుకొంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని లేఖ విడుదలయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *