సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణ టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. గత సోమవారం రాజ్యసభలో ..తెలంగాణ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, 2014 లో పార్లమెంట్ తలుపులు మూసి నియంతృత్వంతో ఏపీ ప్రజల హక్కులను కాలరాసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనలో చేసిన ద్రోహం, ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఆర్ధిక మూలలను దెబ్బ కొట్టిన విధానం ఎప్పటికి ఏపీలో ప్రజలు క్షమించరని అందుకే ఇప్పుడు వాళ్ళు ఏపీలో ‘కుటుంబాలను విడదీసే కార్యక్రమం’ చెప్పటారని వారికీ మరోసారి ఏపీ ప్రజలు బుద్ది చెబుతారని , దేశ ప్రజలు బుద్ది చెబుతారని.. ఇప్పటికే ప్రతి ఎన్నికలలలో ఓట్ల శాతంలో దిగజారిపోతూ వస్తుందని ఆధారాలు వివరిస్తూ 2029 తరువాత అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే లేకుండా పోతుందని ‘తీవ్ర కసి’ తో చేసిన వ్యాఖ్యలు రాజ్య సభలోఅటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీ కేంద్ర నేతలను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ ఫై ఈ స్థాయిలో ధ్వజం ఎప్పుడు ఎత్తలేదు. అయితే రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. రాజ్యసభలో ఆన్రికార్డ్లో ఏపీ ఎంపీ మాట్లాడిన విషయాలపై తీవ్ర అభ్యన్తరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత పోలీసులకు కంప్లైంట్ చేశారు.
