సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు నేడు, గురువారం రాజ్యసభలో కూడా వైసీపీ ఎంపీలు అభ్యన్తరాలు వ్యక్తం చేసిన, ఆమోదం పొందింది. ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుల ఆమోదంతో రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని ఇక . అమరావతికి రాజధానిగా చట్టబద్ధత వచ్చిందన్నారు. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విలేకర్లతో మాట్లాడుతూ…. ఈ సమయంలో అమరావతికి దీప హారతులు ఇద్దామని రాత్రి 7 గంటలకు అంతా ఇళ్ల ఎదుట దీపాలు వెలిగిద్దామని సూచించారు. ఈ దీపాలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను మంత్రి లోకేశ్ కోరారు. #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో అందరూ ఫొటోలు షేర్ చేయాలని ప్రజలకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతికి సహకరించిన అందరికీ ఈ సందర్భంగా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు
